ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన ఆగష్టు 9, 1975 లో చెన్నై నగరంలో జన్మించాడు.
మహేష్ బాబు 1975 ఆగష్టు తోమిదవ తేది న మద్రాస్ పట్నం లో ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరా దేవి లకు జన్మించాడు. మహేష్ కు ఒక అన్నయ్య రమేశ్, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శని గలరు. మహేష్ బాబు తన చిన్నతనమున తన అమ్మమ అయిన దుర్గమ్మ గారి దగ్గర పెరిగినాడు. తన తండ్రి సినిమాలో బిజీగా ఉన్న, తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవారు. మహేష్ బాబు తన నాలుగవ ఏట దాసరి నారాయణ రావు గారు తీసిన నీడ చిత్రం ద్వార తెలుగు వెండితెర కు పరిచేయం అయాడు. మహేష్ బాబు మద్రాస్ లోని స్కూల్ లో చదివాడు. చదువుకుంటూనే సెలవుల లో తన తండ్రి చిత్రాలలో నటించాడు. మహేష్ బాబు సినిమాల నుండి కొంత కలం వీరం తీసుకుని లొయోల కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందినాడు. మహేష్ బాల నటుడి గా తన తండ్రి తో పాటు ఏడు చిత్రాలలో నటించాడు. హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ఇతని భార్య. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ.
మహేష్ బాబు తన సినీ ప్రస్తనముని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చితం లో ఒక చిన్న పాత్ర తో మొదలు పెట్టాడు. 1983 లో ప్రముఖ దర్శకుడు కోడి రామ కృష్ణ మనవి మేరకు పోరాటం సినిమా లో తన తండ్రి కృష్ణ గారికి తమ్ముడి గా నటించాడు. ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రం లో మహేశ్ నటన చూసి తను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్య పోయి ఆ అబ్బాయి కి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచారు. అయన ఊహించిన విధముగానే బాల నటుడి గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు. 1987 లో తోలి సరిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రం లో నటించాడు. 1988 లో విడుదలైన మరియు కోందండ రామి రెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రం లో అన్నయ్య రమేష్ తో కలిసి నటించాడు. 1988 లో మరల తన తండ్రి మరియు అన్నయ్య ల తో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో మరో సారి తన తోలి చిత్ర దర్శకుడు కోడి రామ కృష్ణ గారు తీసిన గూడచారి 117 చిత్రంలో నటించాడు. 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసాడు. 1990 లో విదులైన బాలచంద్రుడు మరియు అన్న తమ్ముడు సినిమా తో బాల నటుడి గా తన తొలి ఇన్నింగ్స్ ని ముగించాడు.
మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక సినిమా రంగానికి తిరిగివచ్చాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే సరసన కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ రెండూ కూడా పరాజయం పాలయ్యాయి.
2004లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకు గానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో నాని గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే ఏడు విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయ్యిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.
అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. అతడు చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. 2005లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయ్యినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంగారు నంది లభించింది. 2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న అమితాబ్ బచ్చన్, రాంగోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.
పోకిరీ తరువాత నిర్మాణం అయ్యిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.
సైనికుడు తరువాత నిర్మాణం అయ్యిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఆ తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజ భారీ వసూళ్లను సాదించినప్పటికి అభిమానుల్లో భారీ అంఛనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కాని ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయం గా నిలబడింది. ప్రస్తుతం మహేష్ ఇప్పుదు వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనె మల్టీస్టారర్ సినిమా ఒకటి, సుకుమార్ ధర్శకత్వంలో చంద్రుడు అనే సినిమా ఒకటి చేస్తున్నాడు.

0 comments:
Post a Comment