భారత దేశం లో తెలుగు మాట్లాడే 7.4 కోట్ల (2000 సంవత్సరపు లెక్కలు) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోవుంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. 1997 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 6.97 కోట్లు మందికి పైగా మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి.తెలుగు దక్షిణ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక లలో కూడా మాట్లాడబడుతుంది.తమిళనాడు లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. బెంగళూరు జనాభా లొ 30 % ,మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు. తమిళనాడు లోని హొసూరు,కొయంబత్తూరు లొ కూడా తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేలకొలది తమిళప్రాంతము వెళ్ళి స్థిర పడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా,రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణంగా ఆరాష్ట్ర ప్రాంతీయ భాషయిన తమిళము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటక లో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు.ఇంకా ఒడిషా, చత్తీస్ ఘడ్,మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువ గా మాట్లాడువారు నివసించుచున్నారు. 2. బెంగళూరు 3. చెన్నై 4. హొసూరు 5.కొయంబత్తూరు 6. మదురై (తమిళనాడు) 7. బళ్ళారి 8. రాయగడ 2. బెంగళూరు 3. చెన్నై 4. హొసూరు 5.కొయంబత్తూరు 6. మదురై (తమిళనాడు) 7. బళ్ళారి 8. రాయగడ 9. హుబ్లి 10. వారణాసి (కాశి) 11. షిరిడి 12. జగదల్పూర్ 13. బెర్హంపూర్ ఒరిస్సా 14.ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్ 15. షొలాపూర్ 16. సూరత్ 17. ముంబై -భివాండి 18. ఛత్తిస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు 19.ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు 9. హుబ్లి 10. వారణాసి (కాశి) 11. షిరిడి 12. జగదల్పూర్ 13. బెర్హంపూర్ ఒరిస్సా 14.ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్ 15. షొలాపూర్ 16. సూరత్ 17. ముంబై -భివాండి 18. ఛత్తిస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు 19.ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు.