V.V.S. Laxman

వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 127 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళ్హీ క్రికెట్ లో లక్ష్మణ్ హైధరాబాధ్ జట్టు కు మరియు ఇంగ్లాద్ ధేశవాళ్హీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాదు. 2011 లో లక్ష్మణ్ కు పద్మ శ్రీ పురస్కారమ్ దక్కినది.
1996 సంవత్సరంలో దక్షిణాప్రికా జట్టుతో అహ్మదాబాదులో ఆడిన టెస్ట్ క్రికెట్ట్ మ్యాచ్ లొ యాభై పరుగులు చేసి అరంగ్రేట్రం చేశాడు. కాని తరువాత లక్ష్మణ్ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. 1997 సంవత్సరంలో దకిణాప్రికాతో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు, కాని విఫలం అయ్యాడు. ఇలా మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్టులో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. జనవరి 2000 సంవత్సరంలో భారత్ ఆస్ట్రేలియాకు జరిగిన సీరిస్ లో ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు.
లక్ష్మణ్ ఆట తీరు నాటకీయం గా ఈ సిరీస్ లో మారిపోయింది, ముంబయి లో జరిగిన మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ 20 మరియు 12 పరుగు లు చేసాడు. సచిన్ టెండుల్కర్ మినహా మిగతా అందరూ సరిగా ఆడలేకపోయారు. భారత్ ఈ టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయినా తరువాత 2001 లో జరిగిన కలకత్తాలో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడి లో ఆస్ట్రేలియా పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతి లో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమం లో అతడు చాలా కాలం క్రితం సునీల్ గవాస్కర్ సాధించిన 236(నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2004 లో పాకిస్తాన్ తో ముల్తాన్ లో 309 పరుగులు చేసేవరకు ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. కలకత్తా లో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అంతకు ముందు టెస్టును ఇన్నింగ్స్ తేడా తో ఓడిపోయినప్పటికి మిగిలిన 2 టెస్టులు గెలిచి స్టీవ్ వా యొక్క " చివరి సరిహద్దు" కలను వమ్ము చేసాడు. ప్రదర్శన భారత క్రికెట్ లో ఒక ఇతిహాసం గా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యద్బుత ప్రదర్శన లలో ఆరవది గా విజ్డన్ పత్రిక గుర్తించింది.తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్మణ్ స్థానము ఒక రోజు పోటీ లకు, టెస్ట్ లకు పదిలం చేసుకున్నాడు. తర్వాత అతను తన ఆట తీరును ఇండియా ఆస్ట్రేలియా పర్యటన వరకు కొనసాగించాడు. ఇక్కడ అతను మూడు వన్డే , రెండు టెస్టు శతకాలు సాధించాడు. అతడు ఆస్ట్రేలియా పైన అడిలైడ్ లో 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రవిడ్ తో మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పై వారి సొంత గడ్డ పై గెలవడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడింది. అతను సిడ్నీ టెస్ట్ లో 178 పరగులు చేసి సచిన్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు.ఈ కారణము వలన ఇయాన్ చాపెల్ లక్ష్మణ్ ను " చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ ) అని వర్ణించాడు.

1 comments:

sports2020 said...

I really enjoy reading and also appreciate your work.This is a great inspiring article.I am pretty much pleased with your good work.You put really very helpful information...

vvs laxman

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan