Nandamuri Taraka Rama Rao

నందమూరి. తారక రామారావు or N.T.R  అంటే తెలియని తెలుగు వాడు లేడు. N.T.R  గారు గొప్ప నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు పాలిటీషియన్ కూడ. N.T.R  గారు 28 మే 1923 లో జన్మించినారు.  N.T.R  గారి మొదటి చిత్రం "మనదేశం". మన తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అంటే నందమూరి. తారక రామారావు గారు.  N.T.R  గారు సుమరుగా 320 చిత్రాలు చేసినారు, తెలుగు సినిమా చరిత్ర లో ఒక గొప్ప చరిత్ర సృస్టించినారు. N.T.R  గారిని  "విశ్వ విఖ్యాత నట సార్వభౌమ" అని అనేవారు.  తరువాత కాలంలో నందమూరి. తారక రామారావు గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టి 1982 లో  "తెలుగు దేశం" అనే పార్టీని స్థాపించినారు.

నందమూరి తారక రామారావు గారి గురించి:---

జన్మించిన తేది : 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామం
తల్లిదండ్రులు : లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ
చదివినది : 1947లో బి.ఎ. ఉత్తీర్ణత
మొదటి ఉద్యోగం : సబ్ రిజిస్టార్
కుమారులు : జయకృష్ణ , సాయికృష్ణ , హరికృష్ణ , మోహనకృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , జయశంకర్ కృష్ణ
కుమార్తెలు : లోకేశ్వరి , పురంద్రీశ్వరి , భువనేశ్వరి , ఉమామహేశ్వరి
తొలి చిత్రం : 1949 లో "మనదేశం"
చివరి చిత్రం : మేజర్ చంద్రకాంత్
తెలుదుదేశం ఆవిర్భావం : 1982 మార్చి 29న మధ్యాహ్నం 2-30 గం.లకు.
ప్రభుత్వ ఆవిర్భావం : 1983 జనవరి 9వ తేది
మరణం :1996 జనవరి 18వ తేది.


1982 మార్చి 21 తేదీన ఎన్.టి.ఆర్. జర్నలిస్ట్లులందరికీ పిలిచి రామకృష్ణ స్టూడియోలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తన గురించి తన కుటుంబం గురించి, తన ఆస్ఠిపాస్తుల గురించి, ప్రజలు చూపే ఆదరాభిమానాలకు, ప్రజానేవచేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్న తన తపన గురించి వివరించారు. నటజీవితం విరమించుకున్నారు. పూర్తికాలం ప్రజలకోసం పనిచేయాలని అనుకున్నారు. పరోక్షంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలిపినా, ఎన్ని ప్రశ్నలు వేసినా, రాజకీయ రంగప్రవేశం గురించి సూటిగా మాట్లడలేదు. 1982 మార్చి 29న కొత్తపార్టీ ఏర్పాటుకు సారథ్యసంఘం ఏర్పడింది. దానికి అధ్యక్షుడు ఎన్.ట్.ఆర్. కార్యదర్శి నాదెండ్ల భాస్కరరావు. మధ్యాహ్నం 2-30 గం. లకు కార్యకర్తలు, ఇతర జనంతో కూడిన బహిరంగ సభలో ఎన్.టి.ఆర్. ఉద్విగ్నంగా మాట్లాడుతు తాను "తెలుగు దేశం పార్టీ" అనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆప్రకటనకు హర్హధ్వానాలతో జనామోదం లభించింది. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది. ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో, ఎన్.టి.ఆర్. ఒక మహొత్తుంగ తరంగమై లేచారు. ఆయన ఆశయాలకు జనం జేజేల వర్షం కురిపించారు. వర్ణ, వర్గ వివక్షలు ఏమీ అంటని మహొద్యమం అది. ఆయన సమ్మోహన శక్తికి తోడుగా, శక్తిహీనమై పలుచబడిపోయిన కాంగ్రెస్ అశక్తత కూడా ఆయన ఉద్యమానికి బలమైన ఊపిరిపోసింది. కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రముఖ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులపై ఆధారపడలేదు. ఆసక్తి కూడా చూపలేదు. కొత్తరక్తం కావాలనే కోరుకొన్నారు. అభిమాన సంఘాలు రామదండుగా పనిచేశాయి. పార్టీ నిర్మాణం రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయికి పాకింది. 1982 ఏప్రిల్ 11వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్ల్ల్ల్లో లక్షలాది జనంతో చారిత్రాత్మకమైన మొట్టమొదటి మహాసభ - మహానాడు విజయవంతం అయింది. రామకృష్ణా స్టూడియో నుండి నిజాం కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ హైదరాబాద్ వీధులను దద్దరిల్లజేసింది. ఆ సభలో ఎన్.టి.ఆర్. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒక గుర్తింపు, గౌరవం తేవటానికి కుళ్ళ్లిపోయిన పాత వ్యవస్థను కూకటి వేళ్ళ్లతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఆయన మహొద్వేగంతో చేసిన తొలి ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన పాలన అందించడం కోసమే వచ్చానన్నారు. విజయవంతమైన ఆసభ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పార్టీ జెండా, సైకిల్ గుర్తు ఏర్పడ్డాయి.
జనవరి 3వ తేదీ నుండి 70 రోజులపాటు అవిశ్రాంతగా రాష్ట్రమంతటా పర్యటించారు. 35000కి.మీ. తిరిగారు. మూలమూలకూ వెళ్ళి ఆయన సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే ధోరణిలో వాళ్ల హృదయాలకు హత్తుకునేలా బోధించారు. మహత్మగాంధీ తర్వాత ప్రేమాభిమానాలతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినది నందమూరి తారక రామారావు గారే.
ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలకు పూర్వం ఆయన కొనుగొలు చేసిన చెవర్‌లేట్ వ్యాన్ 1982 ఆగస్టులో 10,000 రూపాయలతో బాగుచేయించి ప్రచారానికి కావలసిన అన్ని సౌకర్యాలతో సిద్దపరచారు. అందులో ప్రచారానికి వెళ్ళే ముందు ఖాకీ దుస్తులు రెండు జతలు ,వెన్నె,తేనే, నిమ్మకాయల రసం, సోడా ఇవన్నీ వ్యాన్‌లో భద్రపరిచి వుంచేవారు. అవసరమున్నప్పుడల్లా వాటిని ఉపయోగించేవారు. దారిలో స్త్రీలు ,పురుషులు ఆబాలగొపాలం ఆయనకు దారి పొడవునా పుష్పహారాలతో ,మంగళహరతులతో జయ జయ ద్వానాలతో నాదస్వరాలతో ఆహ్వానించారు. ఆయన కోసం దారి పొడగునా ఎప్పుడు వస్తాడో ,ఎప్పుడు కనబడుతాడో అనే ఆశతో గంటల తరబడి వాననక,ఎండనక,రాత్రీ,పగలనక వేచి వుండేవారు. వెళ్ళిన ప్ర్తతిచోట పార్టీ కార్యకర్తలకు తన ఉపన్యాసాల క్యాసెట్‌లను, పోస్టర్‌లను, వాళ్లు అనుసరించవలసిన కార్యక్రమాలకు కావలసినవి ఇచ్చి బయలు దేరేవారు. ఆవ్యాన్ లోనే అల్యూమినియంతో తయారు చేసిన నిచ్చ్రెన పైన కూర్చోవడానికి ఆసనం ,లౌడ్‌స్పీకర్లు,మైక్ వంటి సౌకర్యాలన్నీ వున్నాయి. ప్రచార రథం పరిసరాలకు రాగానే ఇసుక వేస్తే రాలనంత జనం క్షణాల్లో పోగయ్యేవారు.యువకులు,పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా వేల సంఖ్యలో ప్రజలు తండోప తండాలుగా ఆ రథం చుట్టూ చేరిపోయేవారు.రామారావు గారి వాక్చాతుర్య ప్రసంగాలకు మంత్రముగ్ధులయ్యేవారు.
1983 జనవరి 5వ తేదిన జరిగిన పోలింగ్ లో తెలుగుదేశం సూపర్ హిట్ అయింది. నిలుచున్న అబ్యర్థులను చూసి ఎవరూ ఓటు వేయలేదు. ప్రతి ఓటరు తాను ఎన్.టి.ఆర్. కే ఓటు వేస్తున్నాననుకుని వేశారు. ప్రతిపక్షం వారి అంచనాలను, ఇతరుల నెగెటివ్ అంచనాలను మించి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 203 స్థానాలను గెలుచుకుంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎన్.టి.ఆర్. నిలబెట్టిన రాజకీయ అనుభవం లేని నాయకులు కూడా గెలిచారు. అబ్యర్థుల్లో మూడు వంతులకు పైగా కొత్తవారే. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో అపూర్వఘట్టం. చాలా నియోజకవర్గాలలో వారెవరో కూడా తెలియని నాయకులు గెలిచారు. అత్యధికులు యువకులు, విద్యాధికులు, 125 మంది పట్టభుద్రులు, 20 మంది వైద్య పట్టభద్రులు, 8మంది ఇంజనీర్లు, 28మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, కేవలం 9 నెలల ప్రాయంగల ప్రాంతీయ పార్టీ, వందేండ్ల చరిత్రగల జాతీయపార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎన్.టి.ఆర్. విశ్వవిఖ్యాత ఎన్నికల విజేతగా విరాజిల్లారు. కనివిని ఎరుగని ప్రజారాజకీయాలకు ఎన్.టి.ఆర్. నాంది పలికారు. రాజ్ భవన్ ను ప్రజలమధ్యకు తెచ్చారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం పలికారు, ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అశేష ప్రజల సమక్షంలోనే ఎన్.టి.ఆర్. మంత్రి వర్గం ముందెన్నడూ లేనివిధంగా లాల్ బహదూర్ స్టేడియంలో 15మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తుంటే స్టేడియం, లక్షలాది ప్రజల ఆనందేతిరేకంతో దద్దరిల్లింది.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో పాల్గొన్న ఎన్.టి.రామారావు గారి చిత్రాలు:--
1.భారతదేశంలో 1952 జనవరి 24న ప్రారంభమైన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఎకైక చిత్రం పాతళబైరవి. ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బొంబాయి,న్యూడిల్లీ,కలకత్తా,మద్రాస్ నగరాలలో ఏకకాలంలో జరిగాయి.
2.మల్లీశ్వరి సినిమా 1952వ సంవత్సరం బీజింగ్ లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదల చేశారు.
3.మహామంత్రి తిమ్మరసు చిత్రం 1963 లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనది.
4.లవకుశ సినిమా 1964లో జకర్తాలోనూ 1965లో మాస్కోలోనూ జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
5.నర్తనశాల చిత్రం 1964లో జకర్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.
6.ఉమ్మడి కుటుంబం 1968లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.
7.కంచుకోట సినిమా 1968లో బెర్లిన్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.
8.దేశోద్దారకులు చిత్రం 1974లో కైరో లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.

ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు గ్రహీతలు:--
తెలుగుజాతి అత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానటుడు యన్.టి.రామారావు గారు. ఆయన పేరిట 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ అవార్డును నెలకొల్పింది. దేశంలోనే అత్యధికంగా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితోపాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డును,ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. యావద్భారత చలన చిత్రరంగంలో విశేషంగా క్రుషి చేసిన నటీ నటులకు ప్రదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ అవార్డును అందుకున్న ప్రముఖులు వీరే.

*1996 అక్కినేని నాగేశ్వరరావు
*1997 దిలీప్ కుమార్
*1998 శివాజీగణేశన్
*1999 లతామంగేష్కర్
*2000 హృషికేశ్ ముఖర్జి
*2001 భానుమతి రామకృష్ణ
*2002 రాజ్ కుమార్
యన్టీఆర్ స్టార్ లైట్స్:--
తొలి జానపద చిత్రం ‘చింతమణి’ (1933)
తొలి చారిత్రక చిత్రం ‘సారంగధర’ (1937)
తొలి కలర్ చిత్రం ‘లవకుశ’ (1963)
తొలి పాక్షిక కలర్ చిత్రం అప్పు చేసి పప్పు కూడు (1959)
తెలుగులో నిడివి గల చిత్రం ‘దానవీరశూర కర్ణ (1977)
తెలుగు నుండి ఎక్కువ భాషాల్లో రీమేక్ అయిన చిత్రం ‘రాముడు భీముడు’ (1964)
తొలి త్రిపాత్రాభినయ చిత్రం కుల గౌరవం (1972) ఎన్.టి.రామారావు గారు
ఏకైక పంచపాత్ర్రాభినయ చిత్రం ‘శ్రీమద్విరాట పర్వం (1979)
టైటిల్ లో ఎక్కువ అత్యధిక అక్షరాలు గల చిత్రం‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ ( 1984)
100 చిత్రాలు తెలుగులోనే కాక, భారతదేశంలోనే తొలిసారి నటించిన హీరో యన్టీఆర్: గుండమ్మ కథ' (1962)
200 చిత్రాలలో నటించిన తొలి తెలుగు హీరో యన్టీఆర్ : ‘కోడలు దిద్దిన కాపురం (1970)చిత్రంతో
300 చిత్రాలలో నటించిన తొలి తెలుగు హీరో యన్టీఆర్ : ‘మేజర్ చంద్రకాంత్’ (1993)చిత్రంతో.


కానీ మనకు ఇప్పటికీ బాధ కరమైన విషయం ఏమిటి అంటే అంత గొప్ప మహాను బావుడు కూడా జీవితం చివరి అంకం లో చాలా కస్టపడ్డారు, చంద్రబాబు నాయుడు చేసిన మోసం వలన అంతటి మహాను బావుడు ఎంతో బాధతో కుమిలి, కుమిలి ఏడ్చి చని పోయాడు. వారి జీవితం అలా ముగిసి పోవడం మనకు ఇప్పటికీ బాధాకరమే.
 జై నందమూరి తారక రామారావు గారు.


0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan