Telugu Stories

Must read

ఒకప్పుడు భర్త ఆలశ్యంగా వస్తే స్త్రీ భరించేది. ఇప్పుడు తల్లి తండ్రులిద్దరూ ఆలశ్యంగా వస్తొంటే పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మొగవాడి జీతం బొటాబొటీగా సరిపోయేది. ఇప్పుడు అలాగే ఉంది. ఇద్దరం సంపాదిస్తున్నాం. కానీ అంత పిల్లల చదువుకోశమే! వాళ్ళెధో ఉద్దరిస్తారన్న ఆశ కూడా లేదు. వాళ్ళు చదువు, మేము కొనుక్కోబోయే కొత్త కారు- అంత స్టేటస్ సింబల్స్. ప్రొద్ధునే ఆధరబాదరగా వంట చేసి పిల్లలని స్కూల్ కి పంపి హడావుడిగా బయలుదేరటం, రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోతూ 'హమ్మయ్య! ఒక రోజు  గడిచింది అనుకోవటం. ఇది దినచర్య. ఒక రొమ్యాన్స్  లేదు, ఒక ఆహ్లాదం లేదు. డబ్బు వల్ల వచ్చే సుఖం తప్ప మరేమీ లేదు. ఈ కల్చర్ల్ షాక్ని, మార్పుని నేను బరించలేకపోతున్నాను. 

Deepavali
మన పూర్వీకులు ఉత్తర ధృవప్రాంతంలో ఉండేవారట. అక్కడ ఉత్తరాయణం ఆరు నెలలూ పగలు, దక్షణాయనం ఆరు నెలలూ రాత్రి. అదే దీర్ఘరాత్రి, ఆ దీర్ఘరాత్రిలో అక్కడివారు దీపాల సహాయం లేకుండా ఏ పనీ చేసుకోలేరు. దీర్ఘరాత్రి ఆరంభమే దీపావళి పండుగ అని, కార్తీక దీపాలు పెట్టేది కూడా అక్కడి సంప్రదాయమేననీ కొందరంటారు.
 చనిపోయినవారు నరకం గుండా పితృలోకానికి పోతారట. నరకం అంధకారమయంగా ఉంటుంది. గనక వారికి దారి కనిపించడానికి, పితృలోకాధిపతి అయిన యముణ్ణి ఆరాధించడానికి మనం  దీపావళి చేసుకుంటామని కొందరి నమ్మకం.
బలిచక్రవర్తి బలవంతుడై స్వర్గాన్ని ఆక్రమించుకున్నప్పుడు మహావిష్ణువు వామన రూపుడై వెళ్లి, మూడడుగులు దానమడిగి, రెండడుగుల క్రింద భూమీ స్వర్గమూ పుచ్చుకుని బలిచక్రవర్తిని పాతాళానికి పంపేశాడు. ఏటా బలిచక్రవర్తి బలిపాడ్యమినాడు భూమికి వస్తాడు. అందుకని ఆ ముందు రోజు మనము దీపావళి చేసుకుంటాము.
రావణుడు సీతను ఎత్తుకుపోగా రాముడు వానరసేనతో వెళ్లి రావణాసురుణ్ణి విజయదశమినాడు పంపాడు. ఆ తరువాత రాముడు సీతతో తిరిగి వచ్చి అయోధ్యలో పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ ఉత్సవమే దీపావళి అని ఓ నమ్మకం.
లోకకంటకుడైన నరకాసురుణ్ణి జయించటానికి శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెళ్లాడు. నరకుడి దెబ్బకు కృష్ణుడు మూర్ఛపోయినా, సత్యభామ ధర్మమా అంటూ నరకుణ్ణి చంపి, భూమిని నిష్కంటకం చేశాడు. నరకుడు చచ్చిననాడు నరక చతుర్దశి. మర్నాడు దీపావళి అమావాస్య. ఈ రెండూ మనకు పండుగలు.
క్రీస్తుకు 58 సంవత్సరాలు పూర్వం విక్రమ శకం ఆరంభమయింది. గుజరాతీలు, మార్వాడీలు, మరికొందరు ఆ శకాన్నే వాడుతున్నారు. విక్రమ సంవత్సరం దీపావళితో ఆరంభమవుతుంది. ఆనాడే విక్రమార్కుడు శకులను జయించి శకారి బిరుదును పొందాడట.
మనకు దీపావళితో చలికాలం ఆరంభమవుతుంది. మనుషులకూ, పంటలకూ అనారోగ్యకరమైన క్రిమికీటకాదులు విజృంభిస్తాయి. మనం దీపావళినాడు కాల్చే బాణసంచా ఈ క్రిమికీటకాలను నాశనం చేసే శక్తి గలది. ఎందుకంటే వీటిలో గంధకం ఉంటుంది. గంధకం కాలినప్పుడు వెలువడే పొగలు గాలిలోని రోగకణాలను నిర్మూలిస్తాయి.
 దీపావళి పండుగ చిన్నలకూ, పెద్దలకూ ఆనందాన్ని చేకూర్చుతుంది. పిల్లలు తలంట్లు పోసుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. అప్పచ్చులు తింటారు. టపాసులు కాల్చుకుంటారు.


Sankranti
భారతదేశమంతటా, జనవరి నెలలో దాదాపు అన్ని ప్రాంతాలలో గొప్పగా జరుపుకునే పండుగ సంక్రాంతి. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడాన్ని మకరసంక్రాంతిగా చెప్పడం మన సంప్రదాయం. దానితోనే ఉత్తరాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది.

ఈ ఉత్తరాయన పుణ్యకాలంలో మరణించిన వారికి జనన మరణాలు లేని మోక్షం ప్రాప్తిస్తుందని మన పెద్దలు విశ్వసించారు. భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో క్షతగాత్రుడై, అర్జునుడు ఏర్పాటుచేసిన అంపశయ్యపై శయనించి, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన ఈ ఉత్తరాయన పుణ్యకాలంలోనే ప్రాణాలు వదిలాడనీ, ఆ విధంగా  ఆయన మోక్షప్రాప్తిని పొందాడనీ మహా భారతం పేర్కొంటున్నది.
ఆంధ్రప్రదేశ్
చలి, పొగమంచు, ఉషోదయ పవనాలు, హరిదాసు కీర్తనలు ముంగిట్లో గొబ్బెమ్మలు--ఇవీ తెలుగు నేలలో సంక్రాంతికి స్వాగతం పలికేవి. భోగికి ముందుగానే ఇల్లూ, వాకిలీ శుభ్రం చేస్తారు. గోడలకు సున్నం పూస్తారు. తలుపులకు రంగులు వేస్తారు. భోగినాడు వేకువజామున లేచి భోగిమంటలు వేస్తారు. భోగిమంటల చుట్టూ కూర్చుని పాటలు పాడతారు. పిల్లలు ఆడతారు.

మకర సంక్రాంతి రోజు సూర్యుడికి పొంగళ్ళు పెడతారు. వ్యవసాయపు పనులలో తమకు సాయపడే పనివాళ్ళకు పిండివంటలతో విందు భోజనాలు పెడతారు. ఈనాములిస్తారు.

మూడవరోజు కనుమపండుగ. అంటే ఇది బంధువులనూ స్నేహితులనూ కలుసుకోవడం, ఆటలతో పాటలతో గడపడం ఈరోజు ప్రత్యేకత. ఆటలపోటీలు, పందాలు, పొటేలు పందాలు, ఎడ్ల పందాలు సాధారణంగా  జరుపుతూ ఉంటారు.

ఆంధ్రరాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ముక్కనుముతో పెద్దపండుగ పూర్తవుతుంది. ఈ సందర్భంగా పశువులనూ, ఎడ్లనూ అలంకరించి పూజిస్తారు. సంక్రాంతిని పెద్దపండుగ అని చెప్పు కోవడం విశేషం.అంటే పండుగలన్నిటిలోకీ పంటల ఊర్పిడి తరవాత వచ్చే ఈ నాలుగు రోజుల పండుగ చాలా గొప్పదన్నమాట!

ఇతర ప్రాంతాలలో
మనదేశంలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. పంజాబులో దీనిని ‘లోహ్రి’ అంటారు. ఇక్కడ కూడా పంట ఇంటికి చేరే రైతుల పండుగగానే దీనిని జరుపుకుంటారు. గ్రామం మధ్య పెద్ద మంట రగిలించి దానిచుట్టూ   పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించి, సుప్రసిద్ధ ‘భాంగ్రా’ జానపద నృత్యంచేస్తారు. ఈ సంద ర్భంగా లు తమ చేతులకూ, పాదాలకూ ‘మెహందీ’ అనే గోరింటాకు పెట్టుకుంటారు.

పశ్చిమబెంగాల్‌లో మకర సంక్రాంతి రోజున రాష్ట్రం నలుమూలల నుంచీ యాత్రీకులు గంగానది  బంగాళాఖాతంలో సంగమించే ‘గంగాసాగర్’ దీవులవద్ద గుమికూడుతారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే, ‘గంగాసాగర్ మేళా’ చాలాముఖ్యమైనది. మకరసంక్రాంతి పుణ్య కాలంలో గంగాసంగమంలో స్నానం చేయడం పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు.

కర్నాటక రాష్ట్రంలో కూడా మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంక రిస్తారు. పురుషులు నూతనవస్ర్తాలు ధరించి, బంధుమిత్రులను కలుసుకుంటారు. చెరకు, ఎండుకొబ్బరి, పప్పులు పంచుతారు. ఈ సంద ర్భంగా గాలిపటాలను ఎగురవేయడం కూడా సంప్రదాయంగా వస్తున్నది.

గుజరాత్‌లోకూడా మకరసంక్రాంతి రోజున రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. గుజరాతీలు మకరసంక్రాంతిని చాలా శుభ ప్రదమైన దినంగా భావిస్తారు. అందువల్ల ఆ రోజున విద్యార్థులకు బహుమతులూ, ఉపకార వేతనాలూ, కానుకలూ ఇస్తారు.

ఇక  కేరళకు వచ్చామంటే మకర సంక్రాం తితో శబరిమల అయ్యప్ప దేవాలయంలో మండల పూజలు--దూరపుకొండలమధ్య మకరజ్యోతి దర్శనంతో పరిసమాప్తమవుతాయి. లక్షలాదిమంది భక్తులు ‘‘స్వామియే శరణం అయ్యప్ప’’అంటూ అయ్యప్పనూ, మకర జ్యోతినీ సందర్శిస్తారు.

ఇలా మకరసంక్రాంతిని మనదేశమంతటా వివిధ ప్రాంతాలలో విభిన్నరీతులలో జరుపుకుంటున్నారు. అవి ఆయాప్రాంత ప్రజల అభిరుచులకూ, ఆచార సంప్రదాయాలకూ అనుగుణంగా ఉంటున్నాయి. అయితే ఎక్కువ ప్రాంతాలలో దీపావళి దీపాలపండుగ అయినటే్ట, మకర సంక్రాంతి పంటల పండుగ. రైతులుపడిన కష్టాలకు ఫలితంగా పంటలు ఇళ్ళకు చేరే సమయం. దానిని ప్రసాదించిన సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పి ప్రార్థనలు జరపడం; ఈ ఆనంద సమయంలో బంధుమిత్రులతో కలిసి హాయిగా గడపడానికి దోహదం చేయడం ఈ పండుగ విశిష్టత. అందుకే ఇది నిజంగానే పెద్దపండుగ అయింది!


vinayaka chavithi
 ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించేప్పుడు  విఘ్నాలు రాకుండా విజయం చేకూర్చమని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం హిందువుల ఆచారం! గజముఖుడైన  బొజ్జగణపతి జన్మ ఉత్సవాన్ని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. ఆయన జన్మదినాన్ని గణేశ చతుర్థి లేదా వినాయక చవితి అని అంటారు. వినాయక చవితిని దేశమంతటా జరుపుకుంటారు. అమితోత్సాహంతో  దేశవ్యాప్తంగా జరుపుకునే మన పండుగలలో ప్రధానమైనది వినాయక చవితి.

మహారాష్ట్రలో ఏటా భాద్రపద శుక్ల చతుర్థినాడు గణేశ మహోత్సవం ఆరంభమవుతుంది. పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవం పదకొండవ రోజు అనంత చతుర్దశితో పరిసమాప్త మవుతుంది. ఇళ్ళల్లో చిన్నచిన్న విగ్రహాల రూపాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. దేవాలయాలలో, బహిరంగ ప్రదేశాలలో పెద్ద పెద్ద  విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరుపుతారు. పెద్ద విగ్రహాలు దాదాపు ఎనిమిది నుంచి పది మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి.

అనంత చతుర్దశినాడు వినాయక నిమజ్జనం జరుపుతారు. ఆరోజు రకరకాల పూలతో, ఫలాలతో, నాణాలతో విఘ్నేశ్వర విగ్రహాలను అందంగా అలంకరించి; కన్నుల పండువగా దీపాలంకరణ చేయబడిన వాహనాలలో భక్తిగీతాలు ఆలపిస్తూ మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. ముంబాయిలో సముద్రంలో జలనిమజ్జనం చేస్తారు.

వినాయకచవితినాడు బియ్యంపిండి, బెల్లం, కొబ్బరి, నువ్వులు కలిపి కుడుములు తయారుచేస్తారు. ఈ కుడుములు వినాయకుడికి ప్రీతిపాత్రమైనవని చెబుతారు. అందుకే విఘ్నేశ్వరుణ్ణి ‘మోదకహస్తుడ’ని కూడా అంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు, గుగ్గిళ్ళతోపాటు ఆయా ప్రాంతాలకు చెందిన పిండివంటలు, పళ్ళు దేవుడికి నైవేద్యంగా పెడతారు.
ఇళ్ళల్లో జరుపుకునే గణేశపూజ సామూహిక ఉత్సవంగా ఎప్పుడు మారిందో తెలుసుకోవాలంటే  మనం ఒకసారి గతాన్ని తిరిగి చూడాలి. అది 1894వ సంవత్సరం. మనదేశం ఆంగ్లేయుల పాలనలో అలమటిస్తూన్న కాలం. భవితవ్యం ఏమిటో తెలియకుండా భారత ప్రజలు నిరుత్సాహంతో, నిస్పృహతోవున్న ఆ కాలఘట్టంలో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు బాలగంగాధర తిలక్‌ భారత ప్రజలను మేలు కొలపడానికి పూనుకున్నాడు.

ఆయన గణేశ చతుర్థిని సామూహిక ఉత్సవంగా మార్చి, అందులో పాలుపంచుకోమని జాతి ప్రజలకు పిలుపునిచ్చాడు. దేశ ప్రజలను సమైక్యపరచి వారిలో జాతీయ, సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించడానికి గణేశచతుర్థిని ఒక పరికరంగా ఆయన ఉపయోగించాడు.  జాతీయ గీతాలాపనలు, నృత్యాలు, ఉత్సవంలో అంతర్భాగాలయ్యాయి. ప్రేక్షకులలో జాతీయ, దేశభక్తి భావాలు ప్రేరేపించడానికి ‘‘తమాషా!’’ అనే జానపద నాటకాలు ప్రదర్శించేవారు.

 ఏనుగు తల ఎలా వచ్చింది?

విఘ్నేశ్వరుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ వింత విషయాన్ని వివరించే విచిత్రమైన  కథలు మన పురాణాలలో చాలా ఉన్నాయి.  వాటిలో రెండింటిని ఇక్కడ చూద్దాం : విఘ్నేశ్వరుడు జన్మించినప్పుడు పార్వతీదేవి తన బిడ్డను ఆశీర్వదించమని దేవతలందరినీ ఆహ్వానించింది.  అందరూ వచ్చారు.  తల్లిని అభినందించి, బిడ్డను ఆశీర్వదించారు.  అయితే, ఒక్క శనిభగవానుడు మాత్రం రాలేదు.

ఇది పార్వతికి కొంత ఆశాభంగం కలిగించింది.  శనిభగవానుణ్ణి రమ్మని మళ్ళీ ఆహ్వానించింది.  ఆయన రానన్నాడు.  తనకు ఒక శాపం ఉందనీ, తాను దేనిని చూసినా అది ముక్కలు చెక్కలవుతుందనీ చెప్పాడు. అయినా పార్వతి ఊరుకోలేదు. వచ్చి తన బిడ్డను ఆశీర్వదించమని శనిభగవానుణ్ణి పట్టుపట్టింది.

శనిభగవానుడు అయిష్టంగానే అక్కడికి వచ్చాడు.  ఆయన బిడ్డను చూడగానే బిడ్డ తల ముక్కలు చెక్కలుగా బద్దలైపోయింది!  శోకంతో పార్వతి హృదయం విలవిలలాడింది. ఆఖరికి దేవగణాలు ఏనుగు తలను తెచ్చి బిడ్డకు అమర్చారు. దేవతలందరూ బిడ్డను భక్తుల కోరికలు తీర్చ తొలిదైవంగా వెలుగొందగలడని ఆశీర్వదించారు! ఇది బ్రహ్మవైవర్త పురాణం చెప్పేకథ!

మరొక సుప్రసిద్ధ పురాణకథ ప్రకారం - పార్వతీదేవి పిండితో కొడుకు బొమ్మనుచేసి, ప్రాణంపోసి, భవన ద్వారంవద్ద కాపలా వుంచి స్నానానికి వెళ్ళిందట. రాక్షస సంహారంచేసి వచ్చిన శివుడు ఆ సంతోషవార్తను భార్యకు చెప్పాలన్న ఉత్సాహంతో లోపలికి ప్రవేశించబోయాడు. కానీ కురవ్రాడు అడ్డుపడడంతో ఆగ్రహంచెందిన శివుడు తన త్రిశూలంతో వాడి తలను తెగగొట్టాడట. పార్వతికి ఈ విషయం తెలియడంతో శోకానలంతో తల్లడిల్లి పోయింది. ఆమెను ఓదార్చడానికి శివుడి ఆజ్ఞ ప్రకారం శివగణాలు - ఏనుగు శిరస్సును తెచ్చి తెగిపడివున్న బిడ్డ శరీరానికి అమర్చారట!  ఆ విధంగా గణపతి గజాననుడయ్యాడు!


Dasara
మనదేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఆటపాటలతో, అలంకరణలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా. ఇది ఆశ్వయుజ మాసంలో వస్తుంది. దుర్గాదేవి లోక కంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించినందుకు గుర్తుగా దసరా ఏర్పడిందని చెబుతారు. ఏ దేవుడిచేతా తనకు మరణం లేదని పరమశివుడి నుంచి వరం పొందిన మహిషాసురుడు, ఆ వర గర్వంతో విరవ్రీగుతూ అందరినీ పీడించసాగాడు. మితిమించిన అహంకారంతో సాధువులనూ, సజ్జనులనూ హింసించసాగాడు. అందువల్ల దేవతలందరూ వెళ్ళి పరాశక్తిని వేడుకున్నారు. రాక్షస సంహారం కోసం దుర్గ అవతరించింది. దివ్యాస్త్రాలతో, అద్భుత శక్తులతో దుర్గాదేవి మహిషాసురుడి మీదికి వెళ్ళి, యుద్ధంచేసి వాణ్ణి హతమార్చింది.

మహాలయ అమావాస్యతో ఆరంభమయ్యే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో తొమ్మిది రోజులు జరుపుకుంటారు. దీనిని దేవీ నవరాత్రులు అని అంటారు. పండుగ పదవరోజు విజయదశమితో పరిసమాప్తమవుతుంది. కొన్ని ప్రాంతాలలో దీనిని పది రోజుల పండుగగా భావిస్తూ ‘దసరా’ అని పిలుస్తారు.
దక్షణాదిలో దసరా అనగానే మనకు గుర్తుకు వచ్చేవి మైసూరులో బ్రహ్మాండంగా జరిగే దసరా ఉత్సవాలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంటే పధ్నాలుగవ శతాబ్దంలో హంపీ విజయ నగరంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవని చెబుతారు.  చివరి విజయనగరం పాలకుడు, ఆ ఉత్సవాలను జరిపే బాధ్యతను మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌కు అప్పగించాడట.  ఒడయార్‌ పాలనాకాలంలో దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరిగేవి. ఆ సమయంలో సైనిక దళాల ప్రదర్శన; సాయంకాలం సంస్థానంలో ఉన్నతోద్యోగులనుంచి గౌరవ వందనస్వీకారం జరిగేది.

సుప్రసిద్ధ సంగీతకారులు, నర్తకులు,  మల్లయుద్ధ వీరులు, కళాకారులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించేవారు. అదేవిధంగా అలంకరించిన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు కూడా ఊరేగిం పులో భాగంగాఉండేవి. ఫిరంగులు, తుపాకులు, బంగారు, వెండి శకటాలు ఈ సందర్భంగా జరిగే ఊరేగింపుకు మరింత శోభను సమకూర్చేవి.

రాజప్రాసాద ప్రాంగణంలో పూజలు జరిపే వారు. అలంకరించిన పట్టపుటేనుగు అంబారీ మీద మహారాజా వచ్చేవారు. ఊరేగింపుకు ముందు ‘నందకంబ’ ఉంటుంది. మేళ తాళాలు, నృత్యాలు ముందు వెళతాయి. పూర్వ వైభవం క్రమేణా తగ్గుతూవస్తున్నా, ఈనాటికీ మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగానే జరుపుతున్నారు.
మన ఆంద్ర ప్రదేశ్ లోను దసరా పండుగను చాలా బాగా జరుపుకుంటారు. మరి ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో దసరా ఎక్కువగా జరుపుకుంటారు. ఇంకా విజయవాడలో కూడా ఎక్కువ జరుపుతారు.

1). ఒక మంచి కథ

ఒక సన్యాసీ ఒక గ్రామం నుండి మరో గ్రామానికి నడిచివేలుతుండగా, దారిలో ఒక కొబ్బరి చెట్టు మీదనున్న కోతి చూసింది. ఎగతాళి చేయాలిని అనుకుని కీచకిచమంటు నవ్వి, ఒక కొబ్బరికాయను అతని మీదకు విసిరింది. ఆ సన్యాసీ ఆది తీసుకున్నాడు. బాగా ఆకలితో, దాహంతో ఉన్నదేమో, కాయను ఒలిచి నీరు తాగి, లోపళ్లున్న కొబ్బరిముక్కను తిని ఆకలి తిరుచుకున్నాడు. చివరిగా కొబ్బరి చిప్పాను బిక్షాపాత్రగా మరుచుకొని, కోతికేశి ఆనందంగా చూసి వెళ్ళిపోయాడు.

కోతి " అసలు నేను ఎందుకు విసిరాను"? అని కుములిపొియింది.
నీతి:--- ఎదుటివారికి హాని చేయాలనే తప్పుడు ఆలోచన ఉన్నవారు తెలుసుకోవాలిసిన కథ.


2). మనం అనుభవించే కస్టసుకాలకు మనమే కారణం అనేది వేదాంతం కాదు, అక్షరాల నిజం.

ఒక గ్రామంలో పొలం గట్టున కూర్చొని చుట్టకాలుచుకుంటున్న రైతు పక్కకు వచ్చి ఒక కుక్క కూర్చోన్నాధి. కూర్చున్నప్పటినుండి కుయ్యో మొర్రో అని ములుగుతుంది. దారిన పొయ్యే దానయ్య ఆది చూసి ఎందుకలా ఏడుస్తోంది? దానికేమినా జబ్బా? అని అడిగాడు.

"జబ్బు లేదు గిబ్బూ లేదు, ఆది ముళ్ళ మీద కూర్చుంది. అవి గుచ్చుకుంటున్నా లేవటానికి బద్ధకం" అన్నాడట రైతు. కొంత మంది జీవితాలు అలాగే ఉంటాయి. విజయం సాదించే మార్గం తెలిసిన, బద్ధకం, వయిధాల వ్యాధితో ఓటమి అంగీకరిస్తారు. అధి పూర్వ జన్మ పలితం అని సరిపెట్టుకుంటారు.

3). నమ్మకాలూ-అమ్మకాలు

ప్రజల్లో గల నమ్మకాలను సొమ్ముచేసుకునే కొత్త కొత్త ప్రక్రియలు ఈ  మధ్య వింటున్నాం. అక్ష్యతృతీయ రోజున ఎటువంటివారైన బంగారం కొని తీరాలని బంగారం వ్యాపారాలవాళ్లు, పత్రికల్లో, సినిమాల్లో, టెవీలో, హొర్డింగులతో ప్రచారం మోత మోగించారు. ఆ రోజు బంగారం కొనకపోతే జీవితాంతం దరిద్రం అనుభవిస్తారనే భయం, సెంటిమెంట్ ప్రచారం చేశారు. దాంతో షాప్‌ల ముందు క్యూయే. అప్పులు చేసి, తాకట్లు పెట్టి, ముందు రోజు తమ పాత బంగారం తక్కువ ధరకు అమ్మేసి, ఆ డబ్బుతో వచ్చినవారు పిచ్చి పిచ్చిగా ఉన్నారు. అసలు ఒకప్పుడు ఈ హడావిదిలేదు, అసలు ఇలాంటి పండగేలేదు.

అమ్మకందార్లు చెప్పే ప్రతి నమ్మకాన్ని ఇలాగే నమ్ముకుంట పోతే, ప్రజలు ఆ వస్తువులు కొనాలనే  తాప్త్రయంతో అప్పులు చేయటంతో పాటు, లేనివాళ్ళు దొంగ పనులు చేసే ప్రమాదం ఉంధీ. విజయం సాదించాలనుకునేవారు ఇటువంటివాటిని పక్కన్ పెట్టి, తన మనసుకు నచ్చినట్లు చేస్‌కాపోవాలి.

4). ఒక దేశంలో ఒక రాజ గురువు, తెలివి ఐన శిష్యుడికోసం వెతుకుతూ, రాజుని ఆశ్రయించాడు. ఆ రాజుగారు అంతా విని అటువంటి గురువుకి శిష్యుడు అవటమంటే పూర్వ జన్మ సుకృతమని భావించి, ప్రకటన చేయించాడు, వచ్చిన వారిలో నలుగురిని, ఎంపిక చేసి గురువు దగ్గరికి పంపాడు. అందులో ఒకడు రాజకుమారుడు, రెండో వ్యక్తి మంత్రి కుమారుడు, మూడవ వ్యక్తి సేనాధిపతి కుమారుడు, నాల్గోవా వ్యక్తి ఒక సామాన్య పౌరిది కుమారుడు.
నలూగిరినీ రాజ గురువు తన ఆశ్రమానికి తిసికెళ్లి చిన్న పరీక్ష పెట్టాడు.

మీలో తెలివి తేటలు, బుద్దిబలం, భుజబలం, సృజనాత్మకత ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఎవరైతే ఈ పరీక్షలో నెగ్గుతారో, వారినే శిష్యుడిగా తీసుకుంటాను ఈ పరీక్ష క్లిస్టామయంది కాదు. నేనుఇప్పుడు అడవిలోకి వెళ్ళి, రాత్రి సమయానికి వస్తాను. మీరు నలుగురు కూటిరాలోనికి వెళ్ళి, నేను వచ్చేసరికి వాటిని పూర్తిగా ఏదో ఒక దానితో నింపలి" అని చెప్పి వెళ్లాడు.రాజకుమారుడు తన బలంతో పక్క అడవిలో గడ్డికొసుకొచ్చి, గదంతా గడ్డితో నింపాడు. మంత్రి కుమారుడు పక్కనే దిగుడుబావిలోని నీటిని తోడి గదంతా నీళ్ళతో నింపాడు. సైనికాధికారి కొడుకు బాగా ఆలోచించి చివరకు పక్కనే ఉన్న గొడ్లాసాల నుండి, పేడ, మట్టి తెచ్చి గదిలో కుప్పలుగా పోసి బయంకరమైన వాసనతో నింపాడు. సామన్యాపొరుడికొడుకుకీ ఎం చేయాలో తోచలేదు, బక్కప్రాణి, ఏధియైన మొయాలన్న అంతశక్తి లేదు.చీకటి పడింది. గురువుగారు వస్తునట్లు తెలిసి అందరు తమ తమ కుటిరంలా ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. అకరి వ్యక్తి చటుక్కున గదిలోకి వెళ్ళి నీమిసంలో వెనిక్కీ వచ్చి అందరిలాగే చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

గురువుగారు వచ్చి నాలుగు కుటిరంలు చూసి, చివరి వ్యక్తిని కోవ్‌గలించుకొని " నువ్వే నాకు తగిన శిష్యుడివి" అని చెప్పి, మిగతా  ముగ్గ్రుని పొమ్మన్నాడు. వాళ్ళు గుర్రాలు ఎక్కి వెళ్ళి పోయారు. చివరి వ్యక్తి ఎం చేసి ఉంటాడో ఇది చదువుతున్నవారు, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి. క్రియేటివ్ గా ఆలోచించండి. బాగా ఆలోచించార? మీ సమాధానం సరియైంధో కాదో ఇప్పుడు సారి చూసుకోండి. ఆ శిష్యుడు చివరలో గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి వచ్చాడు. గదంతా కాంతితో నింపాడు.

0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan